రాజమౌళి , శంకర్ లపై వివరణ ఇచ్చిన అజయ్ దేవగన్

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 10:58 AM

అజయ్ దేవగణ్... బాలీవుడ్ స్టార్ హీరో. దర్శకుడు శంకర్ ప్రస్తుతం కమలహాసన్ తో 'భారతీయుడు-2'కు ప్లాన్ చేశాడు శంకర్. ఇదే సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ అజయ్ దేవగణ్ యాక్ట్ చేస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో తన వివరణ ఇచ్చాడు అజయ్ దేవగణ్. 'భారతీయుడు-2'లో విలన్ పాత్రను పోషించాలని శంకర్ తనను సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నాడు. అయితే, తాను 'తానాజీ' సినిమాతో బిజీగా ఉండటంతో ఈ చిత్రాన్ని అంగీకరించలేక పోయానని అన్నాడు. ఇదే సమయంలో 'ఆర్ఆర్ఆర్'లో తాను నటిస్తున్నానన్న వార్తలపై స్పందిస్తూ, రాజమౌళి ఇంతవరకూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశాడు. తాను రాజమౌళి సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవమూ లేదని చెప్పాడు. 
Recent Post