ఓటీటీలోకి ఒక కొత్త సినిమా, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమయ్యాయి. మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుమారి శ్రీమతి’. ఈ సినిమా సెప్టెంబర్ 28న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అలాగే తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘మ్యాన్షన్ 24’ త్వరలో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.