సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇప్పటికే శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో మూడో హీరోయిన్ కూడా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కేవలం రెండు సీన్లకు మాత్రమే పరిమితం అయ్యే ఆ పాత్రలో కాజల్ అగర్వాల్ అయితే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారని సమాచారం.