కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న సినిమా ‘దేవర’. సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ ఇవాళ తిరిగి వచ్చాడు. దీంతో ఇప్పుడు ఈసినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చింది. రేపటి నుంచి ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్‌లు కూడా పాల్గొనబోతున్నారని టాక్.