హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఓ ప్రయివేట్ పార్టీలో ఎంజాయ్ చేశారు. తన సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ప్రగ్యా జైస్వాల్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరైంది. సదరు పార్టీకి షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా తయారైంది. ఫ్రెండ్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఈ బర్త్ డే పార్టీ ఫోటోలు ప్రగ్యా జైస్వాల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పార్టీకి మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాజరైంది. రకుల్, ప్రగ్యా జైస్వాల్ ల కామన్ ఫ్రెండ్ సామ్ బర్త్ డే అని తెలుస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ హాజరైన ఈ పార్టీ ప్రత్యేకత సంతరించుకుంది. 36 ఏళ్ల ప్రగ్యా జైస్వాల్ షార్ట్ మిడ్డీలో సూపర్ హాట్ గా ఉంది. పార్టీలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రగ్యా ఫోటోలపై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె అందాలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక ప్రగ్యా జైస్వాల్ పరిశ్రమకు వచ్చి దశాబ్దం కావస్తుంది. 2014లో విరాట్టు అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం టిటో ఎంబీఏ టైటిల్ తో హిందీ చిత్రం చేసింది. మిర్చి లాంటి కుర్రోడు మూవీతో తెలుగులో అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ కి దర్శకుడు క్రిష్ కంచె రూపంలో మంచి ఆఫర్ ఇచ్చాడు. కంచె పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఆ చిత్రంలో నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ప్రగ్యా కొంత ఫేమ్ తెచ్చిపెట్టింది. కంచె అనంతరం గుంటూరోడు మూవీలో నటించింది . మనోజ్ హీరోగా తెరకెక్కిన గుంటూరోడు ప్లాప్ అయ్యింది. తర్వాత సాయి ధరమ్ కి జంటగా నటించిన నక్షత్రం మరో డిజాస్టర్. బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. దాంతో అఖండ ఆమె దశ మార్చలేకపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.