కన్నడ నటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజాచిత్రం ‘యూఐ: ది మూవీ’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘చీకటి.. అంతా చీకటి..’ అంటూ మొదలైన టీజర్‌లో కేవలం శబ్దాలు మాత్రమే వినిపించాయి. ‘ఇది ఏఐ వరల్డ్ కాదు. ఇది యూఐ వరల్డ్. దీనినుంచి తప్పించుకోవాలంటే, మీ తెలివితేటలను వాడండి’ అనే వాయిస్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.