ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం, కష్టాలు, నష్టాలు.., కన్నీళ్ళు, ఇబ్బందులు, సంతోషాలు అన్నీ ఉంటాయి. కెరీర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ లో.. కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులతో పాటు.. ఇష్టం లేని సన్నివేశాలు చేయడం లాంటి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సంఘటన గురించి వివరించించి సీనియర్ హీరోయిన్ సదా. ఇండస్ట్రీలో హీరోయిన్స్‌తో మిస్ బిహేవ్ చేయడం, కమిట్ మెంట్ అడిగి అవకాశాలు ఇవ్వకపోవడం, ఇలాంటి సంటనలు చాలా చూస్తుంటాం. సదా మాత్రం ఓ రొమాంటిక్ ఓ సీన్ చేయడానికి డైరెక్టర్స్ ని ముప్పు తిప్పలు పెట్టిందట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. కొత్త ఆర్టిస్ట్ లతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఎంతో మందిని స్టార్స్ గా మార్చిన తేజ. సదా మాట్లాడుతూ.. ఆ సినిమా విషయంలో ఆ సీన్ చూస్తే ఇప్పటికీ కంపరంగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేసింది సదా. జయం సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో.. అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఓ దశాబ్ధం పాటు.. వరుస సినిమాలతో.. స్టార్ హీరోల సరసనన నటిస్తూ.. ఊపు ఊపేసింది. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అవుతున్న క్రమంలో.. బుల్లితెరపై మెరిసింది బ్యూటీ. డాన్స్ షోలకు జడ్జ్ గా హడావిడి చేసింది. ఇక ప్రస్తుతం సినిమాలు లేకపోయినా.. సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది. ఇంకా అమ్మడికి సరైన ఛాన్స్ రాలేదు. ఈ క్రమంలోనే సదాకి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.అయితే ఆసీన్ లో విలన్ గా గోపీచంద్ రాక్షసానందం పొందుతాడు.. గోపీచంద్ సదాను నాలికతో చెంపపై నాకుతాడు.ఆ సీన్ టైంలోనే సదా చాలా ఇబ్బంది పడిందట. నేను చేయను అంటే చెయ్యను.. కావాలంటే నన్ను సినిమాలోనుంచి తీసేయండి అంటూ ప్రాధేయపడిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం సదా మాటను అస్సలు వినలేదట. నువ్వు ఈ సీన్ చేస్తేనే సినిమాకు హైలెట్ అవుతుంది అంటూ బలవంతం చేశాడట. అంతే కాదు సదా ఇబ్బంది చూసి.. విలన్ గా చేస్తున్న గోపీచంద్ కూడా వద్దులేండి సార్.. ఆమె అంత ఇబ్బంది పడుతుంది అన్నారట. కాని తేజ మాత్రం నీకు తెలియదులే అంటూ కోపపడ్డాడట. ఇక అక్కడ ఉన్నవారు కూడా సదాకు సర్ధి చెప్పడంతో అతి కష్టం మీదే ఆమె ఆ సీన్ కి ఒప్పుకునేందట. ఆ సీన్ తనకు జీవితంలో గుర్తుండిపోతుంది అంటున్నారు. ఇక ఆసీన్ అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ల బాగా ఏడ్చిందట సదా. అంతే కాదు.. పదిసార్లకు పైగా తన ముఖం కడుక్కుందట. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తే ఆమె తెగ బాధపడుతుంట. అందుకే సినిమా చూస్తే.. ఆ సీన్ వచ్చినప్పుడు స్కిప్ చేస్తుందట సదా. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.