ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ సూపర్ స్టార్ కి సారీ చెప్పిన కన్నడ సూపర్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 04:14 PM



మహేష్‌తో అనిల్‌ రావిపూడి చేయబోయే చిత్రం కోసం ఆల్రెడీ కాస్టింగ్‌ ఫైనలైజ్‌ చేస్తున్నారు. ఇందులో ఒక కీలక పాత్ర కోసం కన్నడ స్టార్‌ ఉపేంద్రని సంప్రదించారు. ఉపేంద్ర, విజయశాంతి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారనే వార్త బాగా ప్రచారమయింది. మహేష్‌ సినిమా కోసం తనని సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే ఇప్పుడు తన డేట్లు ఖాళీ లేవని, అందుకే చేయలేనని చెప్పి సారీ అనేసానని ఉపేంద్ర మీడియాతో చెప్పాడు. ఐలవ్యూ అనే చిత్రం ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాలకి వచ్చిన ఉపేంద్ర 'సన్నాఫ్‌ సత్యమూర్తి' తర్వాత తెలుగులో అలాంటి సపోర్టింగ్‌ రోల్స్‌ చేయడానికి సిద్ధమే అన్నాడు.

కాకపోతే కన్నడలో సినిమాలు లేనపుడు, చాలా మంచి క్యారెక్టర్‌ వచ్చినపుడు మాత్రమే చేస్తానని, ఏది పడితే అది చేసేసి తెలుగు ప్రేక్షకులకి తనపై వున్న ఇష్టాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకోలేనని చెప్పాడు. మహేష్‌తో కలిసి నటించాలని వున్నా కానీ వాళ్లు అడిగిన డేట్లు కుదరకపోవడంతో రిజెక్ట్‌ చేసానని, ఈసారి అవకాశమొస్తే కలిసి నటించడానికి ప్రయత్నిస్తానని అన్నాడు. మహేష్‌ 'మహర్షి' పూర్తి చేసుకుని వచ్చేలోగా ప్రీ ప్రొడక్షన్‌ అంతా పూర్తి చేసేసి షూట్‌కి వెళ్లడానికి సిద్ధమైపోతారట. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ముందే ఫిక్స్‌ అయిపోయారు. ఇక విజయశాంతి అయినా ఈ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com