ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ బాబు కథనే అల్లు అర్జున్ చేస్తున్నాడా ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 07:08 PM



తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ కథా చర్చలు మొదలుపెట్టాడు. అయితే కథాపరంగా మహేశ్ బాబు చేసిన సూచనలు సుకుమార్ కి నచ్చలేదు. దాంతో ఆయన మనసు మార్చుకుని బన్నీతో తన తదుపరి ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మహేశ్ బాబు హర్ట్ అయ్యాడని తెలిసి, ఆయనను స్వయంగా కలిసి కూల్ చేశాడు.

ఈ నేపథ్యంలో సుకుమార్ .. మహేశ్ బాబుకి ముందుగా వినిపించిన కథనే బన్నీతో చేయనున్నాడా? లేదంటే బన్నీ కోసం కొత్త కథను సెట్ చేస్తున్నాడా? అనే సందేహం చాలామందిలో తలెత్తింది. మహేశ్ బాబు కోసం అనుకున్న కథనే బన్నీతో సుకుమార్ చేయనున్నాడనేది తాజా సమాచారం. అయితే బన్నీ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తారట .. అంతే. మిగతా కథ అంతా కూడా సుకుమార్ అనుకున్నట్టుగానే ఉంటుంది. జూన్ నాటికి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి, అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com