ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రితికా సింగ్ వైట్ అండ్ బోల్డ్ ఫోటో స్టోరీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2019, 02:24 PM



విక్టరీ వెంకటేష్ 'గురు' చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది రితికా సింగ్. ఆ సినిమాలో రితికా నటనకు ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయ్యారు. ఆ తరువాత ఆమె నటించిన 'శివలింగ' చిత్రానికి కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఇలా రెండు వైవిధ్యమైన పాత్రలతో తెలుగు వారికి దగ్గరైంది ఈ బ్యూటీ. రితిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో తాళ్ళతో కట్టుకున్న చిరుగుల టాప్ వేసుకుంది. చిరుగుల టాప్ మధ్య గ్యాపుల్లో చిల్లింగ్ అందాలు దర్శనమిచ్చాయి.  ఇంగ్లీష్ లో స్టైల్ గా దీన్ని ష్రెడ్డెడ్ టాప్ అంటారు కానీ తెలుగులో మాత్రం అతుకులబొంత అనాల్సిందే.

ఈ ఫోటో చూసి చాలామంది నెటిజనులకు నోటమాట పడిపోయింది కానీ టైపింగ్ చేయదానికి వేళ్ళు మాత్రం భేషుగ్గా పని చేశాయి. అందుకే వెరైటీ కామెంట్లు పెట్టారు.  ఒకరు "అసలు డ్రెస్ ఎక్కడుంది?" అన్నారు.  మరొకరు 'నీకుబాగా సౌకర్యంగా ఉన్నట్టుంది సర్లే. కానీ చాలా చాలా హాటుగా.. సెక్సీ గా ఉన్నావు" అన్నాడు.  ఒక నెటిజనుడు మాత్రం గట్టిగా హర్ట్ అయినట్టున్నాడు "రితికా నీ దగ్గర నుండి ఇలాంటి ఫోటోను అసలు ఊహించలేదు" అన్నాడు.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com