ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఆయన బయలుదేరాడు: ఉపాసన

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 10:45 AM



దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నిర్మితమవుతున్న మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' (వర్కింగ్ టైటిల్)పై ఇంతవరకూ ఏ విధమైన వివరాలూ బయటకు వెల్లడి కాలేదన్న సంగతి తెలిసిందే. ఇక సినిమా విశేషాలను, మరికొన్ని అంశాలను ప్రేక్షకులకు చెప్పేందుకు రాజమౌళి ఈ ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్లేందుకు రామ్ చరణ్ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న వేళ, వెనుకనుంచి ఫోటో తీసిన ఉపాసన, దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. గుడ్ లక్ టీమ్ అంటూ అభినందనలు తెలిపారు. ఉపాసన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com