ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం : మ‌లైకా అరోరా

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 11:10 AM



నా జీవితంలో నేను తీసుకున్న అతి పెద్ద నిర్ణయం.. విడాకులు ఇవ్వాలి అనుకోవడం. దాని వల్ల నేను ఇప్పుడు స్వేచ్ఛగా, నచ్చినట్లు జీవిస్తున్నాన‌ని బాలీవుడ్ న‌టి..మ‌లైకా అరోరా తెలిపింది. మనకు కావాల్సింది మనం ఎంచుకుంటేనే బాగుంటుంది. వేరే వాళ్లు వచ్చి ‘ఎందుకు ఇలా చేశావు, చుట్టూ పరిస్థితుల గురించి ఆలోచించు’ అంటే ఎలా. ప్రతి ఒక్కరు ప్రేమను కోరుకుంటారు, భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు విడిపోవాలి అనుకుంటారు, మళ్లీ కొత్త ప్రేమను వెతుక్కుంటారు. జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎవరూ అనుకోరు. నా సొంతంగా ఆ నిర్ణయం (విడాకులు) తీసుకోవడం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నా’ అని పేర్కొంది. మరోపక్క మలైకా నటుడు అర్జున్‌ కపూర్‌తో ప్రేమలో ఉన్నట్లు రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. వీరిద్దరు జంటగా తరచూ బయట కనిపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో జరిగే వేడుకలకు హాజరౌతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com