ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసిఆర్ బయోపిక్ 'ఉద్యమ సింహం' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 12:13 PM



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఉద్యమ సింహం' ట్రయిలర్ విడుదలైంది. నటరాజన్, పీఆర్ విఠల్ బాబు, సూర్యలు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించగా, దిలీప్ బండారి సంగీతాన్ని సమకూర్చారు. చిత్రాన్ని పద్మనాయకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మించారు.

మార్చి 29న విడుదల కానున్న ఈ సినిమాలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానాన్ని చూపించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన పడ్డ తమన, ఎదుర్కొన్న అవమానాలు, చేసిన ఆమరణ దీక్ష తదితరాంశాలను చిత్రంలో ప్రస్తావించినట్టు ట్రయిలర్ చెబుతోంది. "కత్తి పట్టకుండా యుద్ధం చేయనీకి పోతుండాం. రాష్ట్రం వచ్చుడో... నేను చచ్చుడో", "రాష్ట్రం ఇస్తరా? చస్తరా?" వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com