ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదే నా చివరి సినిమా ఏమో?.. రాజమౌళి

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2019, 02:46 PM



మహాభారతాన్ని కచ్చితంగా తీస్తాను బహుశా అదే నా చివరి చిత్రం లేదా సిరీస్ అవ్వోచ్చని వెల్లడించారు టాలీవుడ్ జ‌క్క‌న్న రాజ‌మౌళి.ఈరోజు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో  ఎన్టీఆర్‌- చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌పై  ఆస‌క్తిక‌ర విషయాలను దర్శకుడు రాజమౌళి తెలిపారు.   బాహుబలి తరువాత మహాభారతం తీస్తారని వార్తలు వచ్చాయి. ఎప్పుడు చేస్తున్నారు మహాభారతం, మహాభారతం ప్రాజెక్ట్ మీ మైండ్‌లో ఏ స్థానంలో ఉందని ఓ విలేకరి అడగగా.. రాజమౌళి స్పందిస్తూ.. మహాభారతం నా తరువాతి చిత్రమని నేను ఎక్కడా చెప్పలేదని అన్నారు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పానని తెలిపారు.


మహాభారతం ప్రాజెక్ట్ మీ మైండ్‌లో ఏ స్థానంలో ఉన్నదనే ప్రశ్నకు.. మహాభారతం 24 గంటలు నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుందని.. దాని కోసం ఆయన మైండ్‌లో ఓ ప్రత్యేకమైన విభాగం పనిచేస్తుందని సరదాగా సమాధానమిచ్చారు.  అలాగే మహాభారతాన్ని కచ్చితంగా తీస్తాను బహుశా అదే నా చివరి చిత్రం లేదా సిరీస్ అవ్వోచ్చని వెల్లడించారు. మహాభారతం ప్రాజెక్ట్ మీ మైండ్‌లో ఏ స్థానంలో ఉన్నదనే ప్రశ్నకు.. మహాభారతం 24 గంటలు నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుందని.. దాని కోసం ఆయన మైండ్‌లో ఓ ప్రత్యేకమైన విభాగం పనిచేస్తుందని సరదాగా సమాధానమిచ్చారు  మొదట ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వివరాలు మీడియాకు తెలిపిన తరువాత మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com