ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే నేనూ వంట నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నా

cinema |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2017, 04:17 PM



టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న ద‌శ‌లోనే పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడ‌లుగా మారిపోయింది స‌మంత‌. పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పెళ్లి కాక‌ముందు వంట గురించి ప్ర‌శ్నిస్తే.. `నేను వంట నేర్చుకోవ‌డం ఎందుకు? చైతూకి వంట బాగా వ‌చ్చు` అని చెప్పి నాగ‌చైత‌న్య వంట చేస్తున్న ఫోటోల‌ను కూడా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.


అయితే పెళ్ల‌య్యాక స‌మంత నిర్ణ‌యం మారింది. క‌చ్చితంగా వంట నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. పెళ్ల‌య్యాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని స‌మంత చెప్పింది. దానికి ఓ కార‌ణం కూడా చెప్పింది. `కొత్త దంప‌తులం కావ‌డంతో స‌న్నిహితుల ఇళ్ల‌కి విందు భోజ‌నాల‌కు వెళ్తున్నాం. ఆయా స‌మ‌యాల్లో ఆ ఇంటి మ‌హిళ‌లు ఎంత బాధ్య‌త‌గా వండి, వ‌డ్డిస్తున్నారో చూశా. అందుకే నేనూ వంట నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌`ని చెప్పంది స‌మంత‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com