పెరిగిన 'భాగమతి' బడ్జెట్

  Written by : Suryaa Desk Updated: Fri, Oct 20, 2017, 10:49 AM
 

ఏ పాత్రలోనైన నటించి మెప్పించే నటి అనుష్క. ఆమె చిత్రసీమకొచ్చి పదేళ్ల పైనే అయినా ఇంకా తన అందచందాలతో అలరిస్తూనే ఉంది. అలాగే కొన్ని పాత్రల్లో మరచిపోలేని నటననూ ప్రదర్శించింది. బాహుబలితో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఇప్పుడు మరో చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమాలో అనుష్క కోసం అయిదు కోట్లు ఖర్చు పెడుతున్నారట. 


తెలుగు, తమిళ భాషల్లో అనుష్కకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ప్రస్తుతం ఆమె తెలుగులో 'భాగమతి' తప్ప మరో సినిమా చేయడం లేదు. పూర్తి బరువు తగ్గిన తర్వాత మాత్రమే మరో సినిమా చేయాలని తాను భావిస్తుందట. అయితే భాగమతి చిత్రంలోను అనుష్క లావుగా కనిపిస్తున్నందనున చిత్ర దర్శకుడు అశోక్ ఆమెని నాజూకుగా చూపించేందకు సీజ్ వర్క్స్ కోసం 5 కోట్లను అదనంగా ఖర్చు పెట్టబోతున్నాడట. అరుంధతి, రుద్రమదేవి వంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల మాదిరిగానే ఈ మూవీ మంచి హిట్ అవుతుందని అంటున్నారు.
Recent Post