ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'గామి' కి డబ్బింగ్ పూర్తి చేసిన మాస్ క దాస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 05:45 PM



విద్యాధర్ కగిత దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గామి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ఫాంటసీ అడ్వెంచర్‌ యొక్క డబ్బింగ్ ని విశ్వక్సేన్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక వీడియో ని పోస్ట్ చేసి అధికారకంగా ప్రకటించారు.

ఈ సినిమాలో విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి జోడిగా నటిస్తుంది. విశ్వక్సేన్ ఈ సినిమాలో అఘోరాగా కనిపించనున్నాడు. MG అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com