ట్రెండింగ్
Epaper    English    தமிழ்

OTT విడుదల తేదీని లాక్ చేసిన 'రూల్స్ రంజన్'

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:18 PM



రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' చిత్రం 2023 అక్టోబ‌ర్ 6న విడుద‌ల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకొని డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం నవంబర్ 30 సాయంత్రం 6 గంటలకు ఆహాలో డిజిటల్ రంగ ప్రవేశం చేయనుంది.

ఈ చిత్రంలో నేహా శెట్టి కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, హైపర్ ఆది, హర్ష చెముడు, సుబ్బరాజు, అజయ్, గోపరాజు రమణ, అన్నూ కపూర్, సిద్ధార్థ్ సేన్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ మరియు గుల్షన్ పాండే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దివ్యాంగ్ లావానియా మరియు వి మురళీ కృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com