ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బబుల్‌గమ్ : ఇజ్జత్ సాంగ్ మేకింగ్ వీడియో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:34 PM



ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల మరియు ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికి తెలిసిందే. రవికాంత్ పెరుపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'బబుల్‌గమ్‌' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా నుండి ఇజ్జత్ ట్రాక్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ సాంగ్ మేకింగ్ వీడియో ని మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేసారు.

ఈ చిత్రంలో రోషన్ సరసన మానస చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 29, 2023న విడుదల కానుంది. హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ బబుల్‌గమ్‌ను నిర్మించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com