ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లాల్‌సలామ్‌' కి డబ్బింగ్ ని పూర్తి చేసిన లెజెండరీ ఇండియన్ క్రికెటర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:56 PM



సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లాల్ సలామ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ ముంబైకి చెందిన మొయిదీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, ది లెజెండరీ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ లాల్‌సలామ్‌కి తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సినిమాకి ది లెజెండ్‌ని కలిగి ఉండటం నిజంగా గౌరవం ఉంది అంటూ డబ్బింగ్ స్టూడియోలో ఒక పిక్ ని పోస్ట్ చేసి మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.

తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా పొంగల్ 2024లో విడుదల కానుంది. లాల్ సలామ్ సినిమా క్రికెట్ మరియు హిందూ-ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా. ఈ చిత్రంలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ రజనీకాంత్ సోదరిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com