ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3M మిలియన్ వ్యూస్ ని క్లాక్ చేసిన 'డెవిల్' రెండవ సింగల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 07:27 PM



నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. చిత్ర బృందం హర్షవర్ధన్ రామేశ్వర్ కంపోస్ చేసిన డెవిల్ యొక్క రెండవ సింగల్ ని 'దిస్ ఈజ్ లేడీ రోజీ' ని విడుదల చేసారు. తాజగా ఇప్పుడు, ఈ సాంగ్ యూట్యూబ్ లో 3.5 మిలియన్ వీక్షణలను సంపాదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 24, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com