ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' ని ఓవర్సీస్ లో విడుదల చేస్తున్న ప్రముఖ ప్రొడక్షన్ హౌస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:34 PM



టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో నితిన్ తన 32వ చిత్రాన్ని రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో నితిన్‌కి జోడిగా శ్రీలీల నటించనుంది. ఈ చిత్రానికి 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమాని ఓవర్సీస్ లో శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు చరిష్మా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలిసి విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.


డిసెంబర్ 8, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com