ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆన్ -సెట్ స్టిల్‌ను విడుదల చేసిన 'సాలార్' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 30, 2023, 02:15 PM



ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు సాయంత్రం 07:19 గంటలకు విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


తాజాగా ఇప్పుడు అభిమానులను అలరించటానికి సాలార్ యొక్క ఆన్-సెట్ స్టిల్‌ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ పిక్ లో ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ స్మార్ట్‌ఫోన్‌లో నిమగ్నమై చిత్రానికి సంబంధించిన ఏదో చర్చిస్తున్నారు. ఈ స్టిల్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.

యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్నఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, పొగరు ఫేమ్ శ్రీయా రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com