చిరంజీవి ఫ్యామిలీ నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. తన మొదటి సినిమా 'ఒక మనసు' తో మంచి ప్రేమ కథ చిత్రం లో నటించి పలువురి ప్రశంశలు అందుకుంది. ఇక ప్రస్తుతం ప్రణీత్ బ్రామ్మడపల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సూర్యకాంతం’ లో రాహుల్ విజయ్ తో జత కట్టింది నిహారిక.
మార్చి 29 వ తేదీన ఈ చిత్రం విడుదల సందర్భంగా నిహారిక ప్రమోషన్స్ ను ప్రారంభించింది. తాజాగా నిహారిక అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు నిహారిక తనదైన శైలిలో జవాబులు ఇచ్చింది.డేట్ చేయాల్సి వస్తే.. ఓపికగా వినే వ్యక్తిని మాత్రమే తాను ఎంచుకుంటానని… ఎందుకంటే తానెప్పుడూ ఎక్కువగా మాట్లాడతానని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.
ఇక రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత సందీప్ ఎర్రమరెడ్డి నిర్మిస్తున్నారు. రాబిన్ మార్క్ సంగీతం అందిస్తున్నారు.