ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాజిద్‌ ఖాన్‌ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా అన్న ప్రశ్నకు తమన్నా సమాధానం

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2019, 03:18 PM



హ్యాపీడేస్ తో ఎంట్రీ ఇచ్చి అందరిని తన అందంతో కట్టిపడేసింది తమన్నా భాటియా. అభిమానులందరూ ప్రేమగా తమన్నా అని పిలవడం మరచిపోయి 'మిల్కీ బ్యూటీ' అనేంత అందం తనది. టాలీవుడ్ లో కొన్ని సంవత్సరాలుగా  తన హావా కొనసాగిస్తుంది. 



మధ్యలో ‘హిమ్మత్ వాలా’.. ‘హమ్‌షకల్స్’  సినిమాలతో బాలీవుడ్ కి వెళ్లిన తనకు అదృష్టం కలసి రాలేదు. అది కాకా హిమ్మత్ వాలా’ దర్శకుడు సాజిద్ ఖాన్‌తో ఎఫైర్ ఉందని రూమర్ కూడా వచ్చింది. తమన్నా అప్పట్లోనే ఆ రూమర్ ని తిప్పికోట్టింది. తాజాగా తమన్నా బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మరోసారి సాజిద్‌తో ఎఫైర్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. 

గత ఏడాది సాజిద్ ‘మీ టూ’ మూమెంట్లో భాగంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని ‘హౌస్ ఫుల్-4’ సినిమా నుంచి వైదొలగడం తెలిసిన సంగతే. ఆయనపై పలువురు మహిళలు ఆరోపణలు చేశారు. మరి సాజిద్‌ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదా అని తమ్మూను అడిగితే.. ‘‘నేను సాజిద్‌తో చేసిన రెండు సినిమాలూ ఫ్లాప్‌ అయ్యాయి. కానీ ఆయనతో పని చేయడం బాగా అనిపించింది. కానీ ఆయన నాతో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. సాజిద్‌పై వచ్చిన ఆరోపణల గురించి నాకేమీ తెలియదు’’ అని తమన్నా చెప్పింది. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com