అక్కినేని హీరోపై సమంత స్వీట్ వార్నింగ్ ......

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 05:27 PM

మజిలీ చిత్రం తో మన ముందుకు రాబోతున్నారు నాగచైతన్య- సమంత.  శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చైతు - సామ్ లు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సమంత మాట్లాడుతూ చైతూ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు .. అలాగే నా గురించి చైతూ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది" అని సమంత అంది. 

ఇక తనకెదురైన ప్రశ్నకి చైతూ సమాధానమిస్తూ .. 'ఎవరికైనా పెళ్లి అయిన ఏడాది వరకే హ్యాపీగా వుంటుంది .. ఆ తరువాత అంతా బోరింగే' అంటూ సమంతను ఉడికించాడు. మరో ప్రశ్నకి సరదా సమాధానంగా ఆయన 'నాకు కార్లన్నా .. అమ్మాయిలన్నా చాలా ఇష్టం' అనడంతో, 'అలా అంటే ముఖంపై పంచ్ ఇస్తాను' అంటూ సమంత కొంటె కోపాన్ని ప్రదర్శించింది. 
Recent Post