సౌందర్య ముఖాన్ని కాలుతో తాకుతూ సీన్ చేయడానికి నేను చాలా ఇబ్బందిపడ్డాను

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 05:53 PM

అప్పట్లో తిరుగులేని తారగా ఓ వెలుగు వెలిగిన నటి రమ్యకృష్ణ. దాదాపు నిన్నటి తరం తెలుగు హీరోలు అందరితోటి నటించింది. మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తనవంతుగా సహాయ పాత్రలు చేస్తూ వస్తుంది. ఇండియన్ సినిమాలో బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా 'బాహుబలి' శివగామిగా తన నటన తో ఆ పాత్రకు ప్రాణం పోసింది.

ఇలాంటి చెప్పుకోదగ్గ పాత్రలు రమ్యకృష్ణ జీవితంలో చాల ఉన్నాయి . అందులో ఒకటి రజినీకాంత్ హీరోగా వచ్చిన 'నరసింహ' సినిమాలోని నీలాంబరి క్యారెక్టర్.  తాజా ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ ఈ పాత్రను గురించి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే ఆ పాత్రపట్ల నాకు ఆసక్తి వుండేది కాదు. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రను చేయడానికి నేను చాలా భయపడ్డాను. ముఖ్యంగా 'నీలాంబరి' పాత్ర మనస్తత్వం నన్ను కూడా చాలా కలవరపాటుకు గురిచేసింది. సౌందర్య ముఖాన్ని కాలుతో తాకుతూ నాలోని పొగరుని చూపించే సీన్ చేయడానికి నేను చాలా ఇబ్బందిపడ్డాను. అలాగే మరికొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయితే, 'నీలాంబరి' పాత్ర ఇంతటి పేరును తీసుకొస్తుందని అప్పట్లో నేను ఎంతమాత్రం ఊహించలేదు" అని చెప్పుకొచ్చారు.

రమ్యకృష్ణ తన తదుపరి చిత్రం 'సూపర్ డీలక్స్' లో వేశ్యగా కనిపించే పాత్ర చేస్తుంది. ఆ సినిమా మరి కొద్దీ రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. 


 


 
Recent Post