'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాయిదా పడనుందా ?

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 06:40 PM
ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మి పార్వతి ప్రవేశించిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇతి వృత్తం మీద రామ్ గోపాల్ వర్మ తీస్తున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటినుండి ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈపటికప్పుడు వర్మ తన స్టయిల్లో పబ్లిసిటీ పెంచుతున్నాడు. 

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను  సెన్సార్ బోర్డు కి పంపిన అక్కడి నుండి ఎటువంటి సముఖత రాకపోవడంతో వర్మ సందిగ్ధంలో పడ్డాడు.  మొదటి నుండి  ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును విలన్ గా చూపించడం.. పైగా సినిమాను ఎలక్షన్స్ టైములో రిలీజ్ చేయాలనుకోవడంతో ప్రస్తుతం ఈ సినిమాను అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు తెగ ప్రయత్నిస్తున్నారు. మార్చి 22 న విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్, మార్చి 29వ తేదికి విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. చూద్దాం మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో... Recent Post