క్రికెటర్‌గాప్రేక్షకులను అలరించ‌నున్న హీరో నాని

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 18, 2019, 10:00 PM

త్వరలో హీరో నాని క్రికెటర్‌గాప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. జెర్సీ పేరుతో రూపొందుతున్న చిత్రంలో నాని క్రికెటర్‌ పాత్రని పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత నాని నటిస్తున్న చిత్రం గ్యాంగ్‌ లీడర్‌. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభించారు. విక్రమ్‌ కె.కుమార్‌ మనం ఫేమ్‌ దర్శకుడు. ఈ సినిమా తర్వాత మరో సినిమా నాని కమిటయ్యారు. నానిని హీరోగా పరిచయం చేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. వీరిద్దరు కలిసి జెంటిల్‌మెన్‌ అనే సినిమా చేశారు. ఇది మూడవ సినిమా. ఇందులో అదితిరావు హైదరీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకున్న తెలుగు నటి అతిదిరావు హైదరి. మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహన లో హైదరి నటించిన విషయం తెలిసిందే. 


 


 


 
Recent Post