నేను చెన్నై లో ఉంటున్న విషయం ఎవరికీ తెలియదు: ప్రియారామన్

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 11:00 AM
.. 'శుభసంకల్పం' ,'శ్రీవారి ప్రియురాలు', 'మా ఊరి మారాజు' .. వంటి సినిమాలతో  గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ ప్రియారామన్. తాజాగా  'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రియారామన్ మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. 

"మొదటి నుంచి కూడా నేను చెన్నైలోనే ఉంటున్నాను. అయితే నటనకు దూరంగా ఉండటం వలన, నేను చెన్నైలోనే ఉంటున్నాననే విషయం చాలామందికి తెలియకుండా పోయింది. వివాహమైన తరువాత నేను బ్రేక్ తీసుకున్నాను .. పిల్లలు పుట్టిన తరువాత వాళ్ల ఆలనా పాలన నాకు ముఖ్యమని అనిపించింది. వాళ్ల బాధ్యతను వేరే వాళ్లకి అప్పగించడం నాకు ఇష్టం లేదు. వాళ్ల దగ్గరే ఉంటూ .. వాళ్లకి కావలసినవి సమకూర్చడంలోనే ఆనందం వుంది. అందువలన వాళ్ల కోసమే పూర్తి సమయాన్ని కేటాయించడం వలన, సినిమాలకి పూర్తిగా దూరమయ్యాను" అని చెప్పుకొచ్చారు.Recent Post