నాగబాబు వ్యాఖ్యలు వరుణ్‌తేజ్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉంది : ప్రసన్న

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 11:21 AM

గత కొంతకాలంగా మెగా బ్రదర్ అయిన నాగబాబు ' నా ఛానల్ నా ఇష్టం' అనే యూట్యూబ్ ఛానల్ తో చేస్తున్న హంగామా తెలిసిందే. అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఎవరో తెలియదు అని పెద్ద బాంబే వేశారు. అయితే ఈ విషయం పైన ప్రముఖ నిర్మాత ప్రసన్నకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్-బాలకృష్ణ మంచి ఫ్రెండ్స్ అని ,వారిమధ్య స్నేహపూర్వకమైన బంధం ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్లిద్దరి మధ్య నాగబాబు వైరం పెంచే వ్యాఖ్యలు కూడవని హితవు పలికారు. నిజానికి నాగబాబుది బాలయ్య స్థాయి కాదన్నారు. బాలయ్య స్థాయితో నాగబాబు సరిపోలరని తేల్చి చెప్పారు.

నందమూరి బాలకృష్ణపై లేనిపోని కామెంట్లు చేస్తున్న నాగబాబు వ్యాఖ్యలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నట్టు చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడిగా ఉన్న నాగబాబు.. బాలయ్య ఎవరో తనకు తెలియదనడం సరికాదన్నారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నాగబాబు చేస్తున్న వ్యాఖ్యల వల్ల వరుణ్‌తేజ్ సినిమాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. నాగబాబు ఒకసారి అద్దం ముందు నిల్చుని తాను చేస్తున్నది కరెక్టో, కాదో తనను తాను ప్రశ్నించుకోవాలని ప్రసన్నకుమార్ సూచించారు.  
Recent Post