ఆ లెజండ్ బయోపిక్ వారం ముందుగానే వస్తుంది

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 11:40 AM

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ లో సావిత్రి జీవితం ఆధారంగా తెరెకెక్కిన 'మహానటి' విశేష ప్రేక్షకాదరణ పొంది ఘన విజయం సాధించింది. ఆ తర్వాత చాల మంది జీవితాల బయోపిక్ లు వస్తున్నాయి.

టాలీవుడ్ లో బయోపిక్ ల పర్వం రీసెంట్ గా మొదలైంది కాని బాలీవుడ్ లో మాత్రం ఎప్పటినుండో ఈ బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుత రాజకీయ చరిత్రలోనే  ఒక చాయ్  బండి నడుపుకునే వ్యక్తి దేశ ప్రధాని ఐన నరేంద్రమోడీ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ రానుంది. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా 'పీఎమ్ నరేంద్రమోదీ'  నిర్మితమైంది. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ .. ఆనంద్ పండిట్ .. ఆచార్య మనీశ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'పీఎమ్ నరేంద్రమోదీ' సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఒక వారం ముందుగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అలా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 
Recent Post