సునీల్ కి పూర్వ వైభవం మళ్ళీ రానుందా !

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 12:49 PM

టాలీవుడ్ బెస్ట్ కమెడియన్ లలో 'సునీల్' ఒకరు. తనదైన పంచులతో టైమింగ్ తో నవ్వించగలిగే ఏకైక కమెడియన్ సునీల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగిన అతను మధ్యలో హీరో గా కొన్ని సినిమాలు చేసాడు. మొదట్లో కొన్ని విజయాలు అందిన ఆ తర్వాత అతను రేసులో వెనుకబడిపోయాడు. చాల రోజుల తర్వాత  'అరవింద సమేత' చిత్రం ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన, ప్రస్తుతం 5 సినిమాలతో బిజీగా వున్నాడు.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న 'చిత్రలహరి'లో ఆయన కామెడీ ఒక రేంజ్ లో ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. మరో మూడు సినిమాలు సెట్స్ పైనే వున్నాయి. ఇక బన్నీ హీరోగా రూపొందించే సినిమాలోను సునీల్ కోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ రోల్ ను డిజైన్ చేశాడట. ఈ పాత్రతో సునీల్ కి పూర్వ వైభవం రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
Recent Post