అక్షయ్ సినిమా లో శ్రీలంక సుందరి జాక్వెలిన్ !

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 12:57 PM

శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌. ఇప్పటిదాకా చేసిన చిత్రాల పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. అక్షయ్ సినిమా లో జాక్వెలిన్‌ పేరు పరిశీలన. ప్రస్తుతం మరో గొప్ప అవకాశం ఈ సుందరి చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా దర్శకుడు రోహిత్‌ శెట్టి రూపొందిస్తున్న సూర్యవంశీ చిత్రంలో నాయికగా ఈ తారను సంప్రదిస్తున్నారట. జాక్వెలిన్‌ ఇప్పటికే అక్షయ్‌తో హౌస్‌ఫుల్‌ 2, బ్రదర్స్‌, హౌస్‌ ఫుల్‌ 3 చిత్రాల్లో నటించింది.


ఈ సారి వచ్చే అవకాశం నాల్గవది. దర్శకుడి ఆలోచనలో నాయికగా తీసుకునేందుకు పూజా హెగ్డే, కత్రీనా కైఫ్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న సూర్యవంశీ త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. తనకింకా చిత్ర బృందం నుంచి పిలుపు రాలేదని చెప్పిన జాక్వెలిన్‌…తనకు దక్కిన ప్రతి అవకాశం గొప్పదనే చెప్పుకుంది. ఆమె మాట్లాడుతూ…బాలీవుడ్‌లో నా ప్రయాణమే ఒక బహుమతి. అదృష్టవశాత్తూ నాకిన్ని అవకాశాలూ పేరూ ప్రతిష్టలూ వచ్చాయి. పరిశ్రమలో గొప్ప వ్యక్తులతో పనిచేసే సందర్భాలు దక్కాయి. నేను ఎంచుకున్న చిత్రాలే ఇవాళ మీ ముందు ప్రతిభావంతమైన తారగా నిలబెట్టాయి. అని చెప్పింది.
Recent Post