మరోసారి మంచి మనసు అని నిరూపించుకున్న మంచు హీరో

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 01:11 PM

శ్రీ విద్యానికేతన్ విద్య సంస్థలు స్థాపించి చాల మందికి తన వంతు విద్య సహాయం చేస్తున్నారు మంచు మోహన్ బాబు. ప్రతి ఏటా కొంత మంది పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్ లు కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా మంచు కుటుంబం అని చాల మందికి తెలిసిన విషయమే. అయితే తాజాగా మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని ఓ బాలికను దత్తత తీసుకున్నాడు.

సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకొని పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానంటూ చెప్పాడు. ఐఏఎస్ అధికారి కావాలనేది పాప ఆశయమని... ఆమె అనుకున్నది సాధించేందుకు కావాల్సినదంతా చేస్తానని తెలిపాడు. తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో ఆమెను చేర్పించారు. 
Recent Post