టాలీవుడ్ మన్మధుడు 'బిగ్ బాస్ 3' చేస్తున్నాడా.....

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 01:48 PM
నార్త్ లో  'బిగ్ బాస్' సీజన్స్ ఎంత పెద్ద హిట్టు అయ్యాయో తెలుసు.  దాన్ని ప్రేరణగా తీసుకొని తెలుగులో కూడా 'మా టీవీ' ఛానెల్ వారు 'బిగ్ బాస్ 1' ఎన్టీఆర్ తో చూపించారు. అది హిట్ అయింది . ఆ తర్వాత వచ్చిన 'బిగ్ బాస్ 2 ' నాని యాంకర్ గా కంటెస్టెంట్స్  గొడవలతో బాగా రక్తి కట్టించారు.  మొన్నటిదాకా  బిగ్ బాస్ 3 హోస్ట్ గా ఎన్టీఆర్ చేస్తాడనే వార్తలు షికార్లు కొట్టాయి. రియాలిటీ షో నిర్వాహకులు నాగార్జునను సంప్రదించినట్టుగా సమాచారంగతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమాన్ని నాగార్జున తనదైన స్టైల్లో సమర్ధవంతంగా నడిపించారు. ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యారు. అందువలన 'బిగ్ బాస్ 3' హోస్ట్ గా ఆయనని మెప్పించడానికి నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం.  

Recent Post