బాలీవుడ్ లో సంచలనాలు స్పృష్టించిన సినిమా సౌత్ కి వస్తోందోచ్ !....

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 19, 2019, 03:46 PM

పోయిన  సంవత్సరం చిన్న సినిమాగా విడుదలై రికార్డుల పరంగా  సంచలనాలు స్పృష్టించిన  కామెడీ డ్రామా ‘బడాయి హో’. 30కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 200కోట్ల వసూళ్లను రాబట్టింది. అమిత్ షా డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆయుష్ మాన్ ఖురానా హీరోగా నటించాడు.

ప్రస్తుతం  ఈ సినిమా  యొక్క రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈచిత్రాన్ని ఆయన అన్ని సౌత్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. మరి ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ లో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి.
Recent Post