ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నా సామి రంగా' మొదటి సింగల్ విడుదలకి తేదీ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 02:43 PM



టాలీవుడ్ కింగ్ నాగార్జున తదుపరి చిత్రం 'నా సామి రంగ' తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇటీవల, మూవీ మేకర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆషికా రంగనాథ్ యొక్క ప్రత్యేక వీడియో గ్లింప్సె ని విడుదల చేశారు.

తాజాగా ఇప్పుడు, డిసెంబర్ 10 నుండి ఈ సినిమా మ్యూజికల్ ప్రొమోషన్స్ ప్రారంభిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఏట్టుకెళ్లి పోవాలనిపిస్తుంది డిసెంబర్ 10వ తేదీ ఉదయం 11:35 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నా సామి రంగ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసన్నకుమార్ కథను అందించగా, MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com