ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తృప్తి ఆసక్తికర వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 03:22 PM



రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. గత వారం విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 500 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో కంటెంట్ పై విమర్శలు వస్తున్నప్పటికీ ఆడియన్స్ మాత్రం థియేటర్స్ కి ఎగబడుతూనే ఉన్నారు.  చాలా వైవిధ్యంగా ఉండే తండ్రి సెంటిమెంట్, రణబీర్ నటన.. రష్మికతో కెమిస్ట్రీ.. ఫస్ట్ హాఫ్ లో పవర్ ఫుల్ గా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి క్రేజీ రెస్పాన్స్ వచ్చేలా చేశాయి. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి చిన్న పాత్రలో మెరిసినప్పటికీ బోల్డ్ సీన్ తో సంచలనం సృష్టించింది. రణబీర్ తో కలసి త్రిప్తి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీనితో త్రిప్తి ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ మూవీలో తన పాత్రకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండడంతో తృప్తి డిమ్రి యువతకి హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. నెటిజన్లంతా ఆమె గురించే చర్చించుకుంటున్నారు. ఆల్రెడీ తృప్తి యానిమల్ మూవీపై తన స్పందన తెలిపింది. రణబీర్ తో తన కెమిస్ట్రీకి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఆమె అనుకోలేదట. మరోసారి రణబీర్ తో కలసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తృప్తి ఇదివరకే తెలిపింది. అయితే తాను ఈ చిత్రంలో న్యూడ్ గా నటించడంపై వస్తున్న కామెంట్స్ కి తృప్తి సమాధానం ఇచ్చింది. అందరూ ఈ మూవీలో బెడ్ రూమ్ సీన్ గురించే మాట్లాడుతున్నారు.  యానిమల్ లో బెడ్ రూమ్ సీన్ కంటే నాకు బుల్ బుల్ మూవీలో అత్యాచార సన్నివేశమే కష్టంగా అనిపించింది. ఏమి చేయలేని స్థితిలో అంతా ఇచ్చేయడం చాలా కష్టం. దానితో పోల్చితే యానిమల్ మూవీ చాలా బెటర్ అంటూ తృప్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com