ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యష్19' కి టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 04:41 PM



యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. KGF 2 విడుదలైన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత రాకింగ్ స్టార్ యష్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లక్ చేసారు. 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.

టైటిల్ రివీల్ వీడియో ఆకట్టుకునేలా ఉంది. వీడియోను బట్టి చూస్తే ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని అనిపిస్తుంది. ఈ చిత్రం 10 ఏప్రిల్ 2025న పెద్ద తెరపైకి రానుందని మూవీ మేకర్స్ వెల్లడించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com