కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఈరోజు తన 69వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు మంచు మనోజ్ ఓ బాలికను దత్తత తీసుకుని ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ విషయాన్ని మనోజ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘నాన్న పుట్టినరోజు సందర్భంగా ఏదన్నా మంచి పని చేయాలనుకున్నాను. సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నందుకు గర్వపడుతున్నాను. విద్యానికేతన్ పాఠశాలలో తనను చేర్పించాను. పాప బాధ్యతలన్నీ నేనే తీసుకుంటాను. మంచి చదువు చెప్పిస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను. ఐఏఎస్ అధికారి అవ్వాలన్నది ఆ బాలిక ఆశయం. తను అనుకున్నది సాధించేందుకు సాయపడతాను’ అని పేర్కొన్నారు.