ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు నాగ చైతన్య 'తాండల్' గ్రాండ్ లాంచ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 09:00 PM



కార్తికేయ 2 దర్శకుడు చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ కోస్టల్ డ్రామా గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో పెద్ద వివాదంలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో చై నటించనున్నారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. అక్కినేని నాగార్జున, వెంకటేష్ దగ్గుబాటి లాంచ్ ఈవెంట్‌కు హాజరు కానున్నట్లు సమాచారం. డిసెంబర్ మధ్య నాటికి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ టాక్.

ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే  ప్రారంభమవుతుంది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com