ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుండి మరో పాట విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 12:14 PM



విశ్వ విఖ్యాత నట సార్వభౌమ 'ఎన్టీఆర్' జీవితం ఆధారంగా తెరెకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమాను వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెస్తున్నాడు వర్మ. ఇప్పటికే ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఈ రోజు ఉదయం వర్మ 'విజయం విజయం ఘన విజయం... విజయం విజయం శుభసమయం... జయహో నాదం.. ఎదలో మోదం.. వదనాల వెలిగే హాసం... గుండెల్లో లోలోపల ఆనందం...' అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విడుదల చేశారు. ఇక ఈ సినిమా మర్చి 29 న థియేటర్లకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com