తమిళనాడులో రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరంటే పక్క అందరు 'విజయ్ ' అనే చెప్తారు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే కోలీవుడ్ లో ప్రస్తుతం టాప్ స్థానంలో ఉన్న హీరో అనే చెప్పాలి. విజయ్ నటిస్తున్న తలపతి 63 షూటింగ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే డిజిటల్ రైట్స్ ను మాత్రం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. అన్ని భాషల్లో కలిపి ఈ చిత్రం యొక్క శాటిలైట్ , డిజిటల్ రైట్స్ విలువ 6 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ డీల్. ఇక అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘తెరి ,మెర్సల్’ చిత్రాలు మంచి విజయాలు సాధించడం తో ఈ మూడవ సినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.