ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ ఎక్స్ 100' కార్తికేయ 'హిప్పీ టీజర్' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2019, 06:06 PM



చిన్న సినిమాగా వచ్చిన 'ఆర్ ఎక్స్ 100' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతో కార్తికేయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. యూత్ లో ఆయనకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రంగా 'హిప్పీ' చిత్రం రూపొందుతోంది.

 తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సినిమా 'ఆర్ ఎక్స్ 100'కి మించిన హిట్ కావాలంటూ టీమ్ కి నాని బెస్ట్ విషెస్ తెలియజేశాడు. కార్తికేయ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపించనున్నాడనే విషయం, ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు.కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, కార్తికేయ సరసన దిగాంగన కథానాయికగా కనిపించనుంది. ఈ రెండు భాషల్లోను కార్తికేయ ఒకేసారి హిట్ కొడతాడేమో చూడాలి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com