సినీ సెలబ్రిటీలు వేదిక మీద కానీ ఏదైనా అకేషన్ లో కానీ డాన్స్ చేయడం ఇప్పటివరకు మనం చూసుంటాం. లేకపోతే సినిమా సాంగ్ షూటింగు లో రోడ్డు పై డాన్స్ చేయడం చూసుంటాం. కానీ హీరోయిన్ శ్రియ షూటింగ్ లేకుండానే రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసింది. ఆ వీడియో ఇప్పుడ ఇన్ స్టాగ్రామ్ లోకి ఎక్కి వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే, దాదాపు వారం రోజుల క్రితం తన సెలవులను ఎంజాయ్ చేయడానికి ఫారిస్ కు వెళ్లిన శ్రియ, అక్కడ జరుగుతున్న ఓ కార్నివాల్ ను చూసి, సంతోషం పట్టలేకపోయింది. వారితో పాటు కలిసి ఆడింది. లాస్ట్ ఇయర్ రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లాడిన శ్రియ తాజా చిత్రం 'నరకాసురన్' విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు శ్రియ చేసిన డాన్స్ వైరల్ అవుతుంది. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీరు ఒకసారి ఓ లుక్కెయ్యండి....