ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిల్ తదుపరి చిత్రం పై తాజా వార్త

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 01:02 PM



అక్కినేని నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ ఏర్పరచుకొన్న హీరో ' అఖిల్'. అక్కినేని కుటుంబ చిత్రం 'మనం' సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తను హీరోగా వచ్చిన మొదటి చిత్రం 'అఖిల్' బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాన్ని చవిచూసినది. ఆ తర్వాత వచ్చిన 'హలో' , 'మిస్టర్ మజ్ను' కూడా తేలిపోయాయినటన పరంగా .. డాన్స్ పరంగా అఖిల్ కి మంచి మార్కులు పడినా, కథా కథనాల లోపం కారణంగా ఆ సినిమాలు సరిగ్గా ఆడలేదు. అందువల్లనే ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు.'బొమ్మరిల్లు' భాస్కర్ వినిపించిన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆయన, ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు.


రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనేది తాజా సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన పనులను 'బొమ్మరిల్లు' భాస్కర్ ముగింపు దశకి తీసుకొచ్చాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుండటం విశేషం. కథానాయిక ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com