ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమా..అందుకే థమన్ ని ఒప్పించిందా ...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 01:30 PM



సమంత ఇప్పుడు సూపర్ ఫామ్  లో ఉంది. ఇటు సినిమాల పరంగా అటు అక్కినేని కోడలిగా సక్సెస్ లైఫ్ ని లీడ్ చేస్తుంది. పెళ్లి అయిన తర్వాత నాగచైతన్య తో కలిసి చేస్తున్న చిత్రం 'మజిలీ'. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాకి గోపీసుందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఆడియోకి మంచి పేరు వచ్చింది. అయితే ఎక్కడ తేడా వచ్చిందో తెలియదుగానీ, రీ రికార్డింగ్ చేయడం మాత్రం కుదరదని చెప్పేశాడట.

రీ రికార్డింగ్ చేస్తానని చెప్పి దానికి కూడా డబ్బు తీసుకున్న ఆయన, ఇలా చివరి నిమిషంలో చేయనని చెప్పడంతో తమన్ ను సంప్రదించి ఒప్పించారట. అయితే సమయం తక్కువగా ఉండటంతో .. తమన్ కి సమంత ఓ మెసేజ్ పెట్టిందట. పెళ్లి తరువాత తాను చైతూ కలిసి చేసిన సినిమా ఇదనీ .. సమయం తక్కువగా ఉన్నప్పటికీ మంచి రీ రికార్డింగ్ తో సినిమాను నిలబెట్టే బాధ్యత ఆయనదేననీ .. ఎక్కడా ఫీల్ మిస్సవకుండా చూడమని రిక్వెస్ట్ చేసిందట. ప్రస్తుతం తమన్ ఆ పనిలోనే వున్నాడని అంటున్నారు.విభిన్నమైన ఈ ప్రేమకథా చిత్రం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com