ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను గే కాదు.. కానీ నాలో ఓ మహిళ కూడా ఉంది: కరణ్ జోహార్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 03:35 PM



బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాత కమ్ దర్శకులలో 'కరణ్ జోహార్' ఒకరు.  కాఫీ విత్ కరణ్ షో తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అతను  గే అంటూ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది. అప్పట్లో స్వలింగ సంపర్కులకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే కరణ్ మీద బోలెడన్ని జోకులు పేలాయి. తాను పొద్దున లేచే సమయానికి వందల మెసేజ్‌లు వస్తుంటాయని.. అందులో చాలా వాటిలో ‘గే’ అని సంబోధిస్తుంటారని.. ట్రోల్ చేస్తుంటారని కరణ్ జోహారే స్వయంగా ఓ సందర్భంలో వాపోయాడు.

ఐతే మొదట్లో ఇలాంటి ట్రోలింగ్ ఇబ్బందిగా అనిపించేదని, తర్వాత వీటికి అలవాటు పడిపోయానని అతనన్నాడు. తాజాగా కరణ్ మరోసారి ఈ విషయమై ఓపెన్ అయ్యాడు. అర్బాజ్ ఖాన్ నిర్వహించే ‘‘పించ్’ అనే కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రెటీలకు.. సోషల్ మీడియాలో ఎదురయ్యే కామెంట్ల మీదే చర్చ నడుస్తుంది. కరణ్ ఈ కార్యక్రమానికి రాగా.. అర్బాజ్ అతడి మీద సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను చదివి వినిపించాడు.వాటిలో ‘మీరు స్వలింగ సంపర్కులా?’ అన్న కామెంట్‌ కూడా ఉంది. ఈ కామెంట్‌పై కరణ్‌ స్పందించాడు. ‘‘నేను గే కాదు. నేను అబ్బాయిగానే పుట్టాను. అందుకు గర్వంగా ఉంది. కానీ నాలో ఓ మహిళ కూడా ఉంది. అదే నన్ను ఓ మగాడిగా మరింత బలవంతుడిని చేస్తోంది. గతంలో నాపై వచ్చిన ఇలాంటి కామెంట్లు చూసి చాలా బాధేసేది. కోపం వచ్చేది. కానీ ఇప్పుడు అవి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. నా గురించి మాట్లాడుకునే హక్కు నెటిజన్లకు ఉంటుంది.

కానీ నాలో ఏదో లోపం ఉంది, వ్యాధి ఉంది అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేయొద్దు. అలా మాట్లాడేవారి నోళ్లు మూయిస్తాను. నాకు నా గురించి కంటే నా పిల్లల గురించి ఎవరైనా కామెంట్‌ చేస్తే విపరీతమైన కోపం వస్తుంది. పిల్లల విషయంలో నేను చాలా సున్నితంగా ఉంటాను. ఎవరైనా వారిపై కామెంట్‌ చేస్తే తట్టుకోలేను. నా గురించి ఇలాంటి కామెంట్లు ఎన్నయినా చేసుకోండి’’ అని పేర్కొన్నాడు. ఐతే కరణ్ ఏం మాట్లాడినప్పటికీ ‘నాలో ఓ మహిళ ఉంది’ అనే కామెంట్ పట్టుకుని సోషల్ మీడియాలో జనాలు మళ్లీ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com