ఒకటి రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అనుపర పరమేశ్వరన్. అ..ఆ సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో వరస విజయాలు అందుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే ఆ తర్వాత మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులోనే కాదు ఏ భాషలోనూ ఒక్క సినిమా కూడా చేయడం లేదు. గతేడాది హలో గురు ప్రేమకోసమే తర్వాత తెలుగులో ఏ సినిమా ఒప్పుకోలేదు ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్యే కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో నటించిన నట సార్వభౌమ సూపర్ హిట్ అయినా కూడా అక్కడా అవకాశాలు రావడం లేదు ఈ భామకు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ బిజీ అయిపోయింది అనుపమ పరమేశ్వరన్. అక్కడే అందాల ఆరబోత చేస్తూ.. గ్లామర్ షో ఒలకబోస్తుంది. తనకు అవకాశం ఇచ్చే దర్శకుడి కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ వైపు ఏ దర్శకుడు కూడా చూడటం లేదు. దాంతో ఫోటోషూట్లు తప్ప మరో పనేదీ లేదు ఈ బ్యూటీకి.
దానికి కారణం కూడా లేకపోలేదు. కెరీర్ మొదట్లో వరసగా మూడు విజయాలు అందుకున్న తర్వాత అన్నీ ఫ్లాపులే ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. చేసిన సినిమాలు మొత్తం ఫ్లాప్ అవుతుండటంతో దర్శక నిర్మాతలు కూడా ఈ భామ వైపు చూడ్డానికి భయపడుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. టిక్ టాక్ వీడియోస్ చేస్తూ టైమ్ పాస్ చేస్తుంది ఈ భామ. ఈ మధ్యే ట్విట్టర్లో లవ్ అనే టీ షర్ట్ వేసుకుని పోజులిచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఇది చూసిన వాళ్లంతా నిజంగానే అమ్మడు ప్రేమలో పడిందేమో అనుకుంటున్నారు. మరి ఈ షర్ట్ వెనక ఉన్న రహస్యం ఏంటో అనుపమ పరమేశ్వరన్ వచ్చి చెప్పాలి.
— Anupama Parameswaran (@anupamahere) March 21, 2019